మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీరు కాంగ్రెస్ పార్టీ లో దుమారం రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు తన వివాదాస్పద వ్యాఖ్యల (Controversial comments) తో పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. తాజాగా ఆమె మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరతీశారు. ఈసారి ఆమె విమర్శల దారి దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) వైపు వెళ్లింది. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ ధర్నాలో…
ఢిల్లీ (Delhi) లో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ ధర్నాలో కొండా సురేఖ మాట్లాడుతూ, “ద్రౌపది ముర్ము వితంతు మహిళ కావడంతోనే పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ పిలవలేదు. ఆమె దళిత మహిళ అయినందువల్ల రామమందిర ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానం ఇవ్వలేదు” అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వం (BJP government) మీద తీవ్రమైన విమర్శలుగా మారాయి.
బీజేపీ నేతలకు కులపిచ్చి అంటూ..
కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ, “బీజేపీ నేతలకు (BJP leaders) నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయింది” అంటూ విమర్శలు గుప్పించారు. మతం, కులం ఆధారంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇది పాలకపక్షంపై నిప్పులు చెరిగే వ్యాఖ్యగా రాజకీయంగా విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి వంటి గౌరవ పదవిపై జరిగిన వ్యాఖ్యలపై సమాజంలో అన్ని వర్గాల నుండి విమర్శలు (Criticisms) వ్యక్తమవుతున్నాయి.
గతంలో కేటీఆర్, సమంతలపై కామెంట్స్..
గతంలో కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial comments) చేశారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబం, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని, కూల్చి వేయకుండా ఉండడం కోసం తన వద్దకు సమంతను పంపించాలని కేటీఆర్ అడిగితే అక్కినేని నాగ చైతన్య, నాగార్జున వెళ్ళమని చెప్పారని, అందుకు సమంత నిరాకరించడంతో విడాకులు ఇచ్చి పంపించేశారని అన్నారు. కేటీఆర్ (KTR) కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనన్నారు. “కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లి లేరా. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం. అని తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలో, రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి.