Minister Jupally | ఆర్థిక రంగానికి బూస్టర్ డోస్ పర్యాటకమే..

Minister Jupally | ఆర్థిక రంగానికి బూస్టర్ డోస్ పర్యాటకమే..

  • 2047 నాటికి జీఎస్టీపీలో 10 శాతం వాటా
  • యువతకు భారీగా ఉపాధి కల్పించడమే లక్ష్యం
  • సమ్మిట్లో తెలంగాణ పర్యాటక దృష్టికోణాన్ని వెల్లడించిన మంత్రి జూపల్లి

Minister Jupally | ఆంధ్రప్రభ : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు Mr. ప్రభాస్ వర్మ పర్యాటక రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీ యోత్పత్తి (జీఎస్ఓపీ)లో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం తెలంగాణ అనుభవాలు సంస్కృతి – ఫ్యూచర్ రెడీ టూరిజం అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలకోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వనరులు తక్కువగా ఉన్న అనేక దేశాలు పర్యాటకాన్ని ప్రధాన ఇంజిన్ గా చేసుకొని అద్భుతమైన ఆర్థిక పురోగతి(Economic progress) సాధించాయి. తెలంగాణలోనూ ఈ రంగానికి అపారమైన సామర్థం ఉందని మంత్రి జూపల్లి కృష్ణా రావు పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. హాస్పిటాలిటీ, హస్తకళలు, రవాణా రంగాల్లోని వేలాది ఎంఎస్ఎంఈ లకు ఇది జీవనాధారమని చెప్పారు.

మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

click here for more

Leave a Reply