Minister | సమాధుల తొలగింపుపై వివాదం

Minister | సమాధుల తొలగింపుపై వివాదం
- విద్యుత్ అధికారుల తీరుపై మండిపడిన ముస్లింలు
Minister | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో గల సర్వే నంబర్ 284/9(Survey number 284/9)లోని హుస్సేన్ సాబ్ దర్గా వద్ద విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు గురువారం సమాధులను సంబంధిత అధికారులు తొలగించడం వివాదాస్పదమైంది. సమాచారం ఇవ్వకుండా విద్యుత్ శాఖ అధికారులు స్తంభాల ఏర్పాటుకు శ్మశానవాటికలోని సమాధులను తొలగించడంతో స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానిక మత పెద్దలు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా హుస్సేన్ సాబ్ దర్గా వద్ద ఉన్న శ్మశాన వాటికలో పట్టణానికి చెందిన ముస్లింలు మృతి చెందితే ఇక్కడే అంతక్రియలు నిర్వహించి ఖననం చేసేవారన్నారు.
గురువారం విద్యుత్ శాఖ(Electricity Department) అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు సమాధులను తొలగించడం సరికాదని, మా పూర్వీకుల సమాధులను తొలగించడం మా మనోభావాలను దెబ్బ తీయడమేనని, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) ఈ ఘటనపై స్పందించాలని, విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు అత్యుత్సాహం ప్రదర్శించిన విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాజకీయ పార్టి ల నాయకులు, పోలీసులు మత పెద్ద లు పరిష్కారం కోసం చర్చ లు జరుపుతున్నారు.

