Minister | మెల్లచెరువు అభివృద్ధికి కొత్త దిశ

Minister | మెల్లచెరువు అభివృద్ధికి కొత్త దిశ

  • అభివృద్ధికి భారీ నిధుల మంజూరు
  • మహాశివరాత్రి వేళ ఆలయ అభివృద్ధికి రూ.1 కోటి నిధుల ప్రకటన
  • శివాలయంలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక పూజలు

Minister | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు అభివృద్ధి కమిటి సభ్యులు మంత్రి ఉత్తమ్ కు పూర్ణకుంభం తో స్వాగతం పలికి శివలింగానికి అభిషేకాలు అర్చనలు చేసిన అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… మెల్లచేరువు నుండి హైదరాబాద్ కు రైల్వే మార్గం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

పారిశ్రామికంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మెళ్ళచెరువుకు గతంలో తానే కేంద్రంతో మాట్లాడి రైల్వే లైన్ ఏర్పాటు చేయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ క్రమంలోనే మెళ్ళచెరువు మండల కేంద్రంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండి తరలి వస్తున్న భక్తుల తో పాటు ఇక్కడి ప్రజల సౌకర్యార్థం మెళ్ళచెరువు నుండి హైదరాబాద్ వరకు డబుల్ రైల్వే లైన్ ఏర్పాటు చేసి ప్యాసింజర్ రైల్ ను ఏర్పాటు చేసుబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Minister

తాను ప్రజా జీవితంలో అడుగు పెట్టాక మెళ్ళ చెరువుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఎంతో ప్రాశస్త్యం కలిగిన శ్రీశ్రీశ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంతో నాకు మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే మెళ్ళచెరువు తనకు మానస పుత్రిక లాంటిదని తాను ప్రజా జీవితంలో పనిచేసిన సుదీర్ఘ కాలంలో ఈ ప్రాంత ప్రజలకు కృష్ణా నది నుండి త్రాగు, సాగు నీరు రప్పించడం నాకు తీరని సంతృప్తి నిచ్చిందన్నారు. ఆ దేవదేవుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సకాలంలో కురిసిన వర్షాలతో రైతాంగానికి జరిగిన మేలు ఎప్పటికీ కొనసాగాలని ఆ దేవ దేవుడిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

Minister

చారిత్రాత్మక మెళ్ళచెరువు శ్రీశ్రీశ్రీ ఇష్టకామేశ్వరి సహిత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం కుడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడ్పాటు తో కోటి రూపాయల నిధులు విడుదల చేయించింనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ముఖ్య నాయకులు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply