మానవత్వం చాటుకున్న మంత్రి

మానవత్వం చాటుకున్న మంత్రి

చిలకలూరిపేట, ఆంధ్రప్రభః మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, కోటప్పకొండ వెళ్లే మార్గంలో పోతవరం దగ్గర ప్రమాదవశాత్తు బోల్తా ఆటో పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆటో డ్రైవర్, అదే సమయంలో ఈ రహదారిపై బనగానపల్లెకు వెళ్తున్న మంత్రి తక్షణమే కాన్వాయ్ ఆపి, వారిని పరామర్శించి, ఫస్ట్ ఎయిడ్ అందించి, అనంతరం అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలో బాధితుడికి మెరుగైన వైద్య సహాయం అందించాలని స్థానిక అధికారులకు సూచించారు. దీంతో మంత్రి స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply