Minister | మహా శివుడికి పూజలు చేసిన మంత్రి కొండ సురేఖ

Minister | మహా శివుడికి పూజలు చేసిన మంత్రి కొండ సురేఖ

మహా శివుడు బోలా శంకరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
రామాలయంలోని మహా శివుడికి అభిషేకం చేసిన మంత్రి కొండ సురేఖ

Minister | కరీమాబాద్ , ఆంధ్రప్రభః మహా శివుడు బోలా శంకరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు అన్నారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివనగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని దర్శించి రామాలయంలో కొలువుతీరి ఉన్న రామలింగేశ్వరుడికి మంత్రి కుండ సురేఖ పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రి కొండ సురేఖకు స్వాగతం పలికారు.

పరమశివుడు, మహేశ్వరుడి కృపా కటాక్షం ప్రజలందరిపై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్, కొత్తపల్లి శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, వడ్నాల మల్లయ్య, మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి చింతం యాదగిరి, శ్రీరామ రాజేష్, బత్తుల నవీన్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల సతీష్, కార్యకర్తలు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply