Minister | మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క

Minister | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను ఇవాళ‌ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…. మేడారం జాతర రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply