Minister | యాదాద్రి నర్సన్న సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి

Minister | యాదాద్రి నర్సన్న సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి
- ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
- ఘన స్వాగతం పలికిన బీర్ల ఐలయ్య
Minister | యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహా స్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, వారికి లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు.

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణం, మోటకొండూరు, ఆలేరు పట్టణాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


