Minister | నిర్మాణ పనులు షురూ..

Minister | నిర్మాణ పనులు షురూ..
- ప్రారంభించిన మంత్రి కొండపల్లి
Minister | గజపతినగరం(విజయనగరం), ఆంధ్రప్రభ : పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా గజపతినగరం మండలం పురిటిపెంటలో రూ.54 లక్షల విలువైన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువులు కల్పన కోసమే పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేస్తే, కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. పల్లె పండుగలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో రూ.120 కోట్ల పనులు శాంక్షన్ చేశామ న్నారు.ఇప్పటికే 60 కోట్ల పనులు పూర్తిచేశామన్నారు. పల్లెపండుగ 2.0 లోభాగంగా మరో రూ. 30 కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేస్తున్నామన్నారు. అదే విధంగా రూ.500 కోట్లతో జిల్లాలో పనులు చేపట్టామన్నారు. రూ.200 కోట్ల పనులు పూర్తి అయి బిల్లులు జమచేస్తున్నామన్నారు.
