Million People | అమెరికా బాట‌లో కెన‌డా

Million People | అమెరికా బాట‌లో కెన‌డా

  • క‌ఠిన‌త‌రం చేసిన ఇమ్మిగ్రేష‌న్ రూల్స్‌
  • ప‌ది ల‌క్ష‌ల మంది భార‌తీయుల ప‌రిస్థితి ఆగ్య‌మ‌గోచ‌రం

Million People | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కెన‌డా కూడా అమెరికా బాట‌లో న‌డుస్తోంది. అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను నివారించ‌డానికి కొత్త‌గా ఇమ్మిగ్రేష‌న్ రూల్స్ క‌ఠిన‌త‌రం చేసింది. కొత్త నిబంధ‌న‌లు మేర‌కు మిలియ‌న్ (Million) కంటే ఎక్కువ మంది చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి రెండు మిలియ‌న్ల‌కు పైగా వ‌ల‌స‌దారులు చ‌ట్ట‌ప‌ర‌మైన హోదా లేకుండా పోతున్నారు. ఇందులో భార‌తీయులు ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటున్నార‌ని ఒక అంచ‌నా.

2025 చివరి నాటికి దాదాపు 1.05 మిలియన్ల వర్క్ పర్మిట్లు గడువు ముగిసినట్లు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (Canada) గణాంకాలు చూపిస్తున్నాయి. మరో 9,27,000 పర్మిట్లు 2026లో ముగియనున్నాయి. వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత, హోల్డర్లు కొత్త వీసా పొందకపోతే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలి.

ఇటీవల‌ ప్రభుత్వ విధాన మార్పులు, తాత్కాలిక కార్మికులు, విదేశీ విద్యార్థులు తమ వీసాను పొడిగించుకోవడాని ఆ దేశం ఇమ్మిగ్రేష‌న్ క‌ష్ఠ‌త‌రం చేసింది. 2026 మొదటి మూడు నెలల్లోనే దాదాపు 3,15,000 మంది తమ హోదాను కోల్పోతారని సమాచారం. 2025 చివరి త్రైమాసికంలో దాదాపు 2,91,000 అనుమతులు గడువు ముగిశాయి. రాబోయే రెండు సంవత్సరాలలో పత్రాలు లేని వలసదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, కఠినమైన నిబంధనల వల్ల భారతీయులపై (Indians) ప్రభావం పడనుందన్నారు.

  • ముగిసిన వ‌ర్క్ ప‌ర్మిట్లు!

వర్క్‌ పర్మిట్ల గడువు ముగియడం, కఠిన నిబంధనలు, న్యాయపరమైన మార్గాలు తగ్గిపోవడం భారతీయులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేయనుందని ఇమిగ్రేషన్‌ (Immigration) కన్సల్టెంట్‌ కన్వర్‌ సెయిరా హెచ్చరించారు. 2025 చివరి నాటికి 10.53 లక్షల మంది విదేశీయుల వర్క్‌ పర్మిట్ల గడువు ముగిసిపోయింది. అలాగే 2026లో 9.27 లక్షల మంది పర్మిట్ల గడువు ముగిసిపోనుంది. వీరిలో ఉద్యోగాలు, చదువు, తాత్కాలిక అవసరాల కోసం వెళ్లిన భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

CLICK HERE TO READ వెనెజువెలా అధ్యక్షురాలిగా డెల్సీ

CLICK HERE TO READ MORE

Leave a Reply