సినీనటి తమన్నా (Tamannaah)ని చూడగానే ఆమె చర్మ సౌందర్యమే ప్రముఖంగా కనబడుతుంది. అందుకే అభిమానులు ఆమెని మిల్కీబ్యూటీ (MilkyBeauty) గా పిలుస్తుంటారు. సాధారణంగా చర్మం రంగు, మెరుపు, నునుపుదనం అందానికి కొలమానంగా భావిస్తుంటాం. అందుకే స్కిన్ కేర్, బ్యూటీ ఉత్పత్తులు మార్కెట్లో చాలా విస్తృతంగా కనబడుతుంటాయి. సినిమా తారలు (Movie stars), మోడల్సే కాదు సాధారణ ఆడపిల్లలు సైతం అందమైన చర్మం కోసం తమ శక్తికి మించే ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్మం అందాన్ని పెంచే చిట్కా తమన్నా వంటి తార చెబితే అది చాలా ఆసక్తిని పెంచేదే అవుతుంది. ఆమె తన చర్మ సౌందర్యం (Skin beauty) కోసం అతి ఖరీదైన విలాసవంతమైన సౌందర్య సాధనాలు వాడుతుండవచ్చు. అందులో వింతేమీ లేదు. అయితే అందమైన చర్మం కోసం ఆమె చెప్పిన ఒక చిట్కా మాత్రం వినడానికి ఆచరించడానికి కాస్త విచిత్రంగా ఉంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమన్నాని ‘మొటిమల (pimples) ను తగ్గించుకోవడానికి మీరేం చేస్తారు?’ అని ప్రశ్నించగా ఆమె ‘నోట్లోని లాలాజలం వాటి పైపూతగా వాడతానని చెప్పి ఆ యాంకర్ ఆశ్చర్యపోయేలా చేసింది. యాంకర్ (Anchor) నవ్వగా అక్కడున్న ఇతర ప్రేక్షకులు తమన్నా సమాధానానికి షాక్ అయిన రియాక్షన్లు (reactions) ఇచ్చారు. అయితే తమన్నా మాత్రం అవేం పట్టించుకోకుండా ‘నిజం, ఇది పనిచేస్తుంది. కాకపోతే పొద్దున్నే బ్రష్ చేసుకోకముందే ఆ పనిచేయాలని’ తెలిపింది. నోట్లోని లాలాజలంలో యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) గుణాలుంటాయని, తాను డాక్టరు కాకపోయినా తనకీ విషయం తెలుసునని, వ్యక్తిగతంగా ఈ చిట్కా తనకు బాగా పనిచేసిందని, దీనివెనుక సైన్స్ ఉందని తాను నమ్ముతున్నానని చెప్పుకొచ్చింది.

మొటిమలు కురుపులుగా మారి రసి కారటం వంటివి లేకపోతే ఉదయాన్నే బ్రష్ చేయకముందే నోట్లోని ఉమ్మిని వాటిపై రాస్తే వెంటనే మొటిమలు తగ్గటం మొదలవుతుందని తమన్నా తెలిపింది. తమన్నా చెప్పిన బ్యూటీ చిట్కా (Beauty tip) నిజంగా పనిచేస్తుందని వైద్య పరిశోధనలు సైతం చెబుతున్నాయి. జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ (Journal of Cosmetic Dermatology) లో ప్రచురించిన అధ్యయనాలతో పాటు అనేక ఇతర అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఉదయపు లాలాజలంలో మొటిమలను నిరోధించే లక్షణాలు, బ్యాక్టీరియా విస్తరించకుండా ఆపే గుణాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

Leave a Reply