జడ్పీ హైస్కూలును పరిశీలించిన ఎమ్మెల్యే..

జడ్పీ హైస్కూలును పరిశీలించిన ఎమ్మెల్యే..

ఘంటసాల – ఆంధ్రప్రభ : మండల పరిధిలోని లంకపల్లిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్ధ్యం పరిశీలించారు. పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు తీరు ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల అవసరాలు తెలుసుకున్నారు.

అసంపూర్తిగా ఉన్న నాడు-నేడు అదనపు తరగతుల భవనం పరిస్థితి పరిశీలించారు. ఈ అసంపూర్తి భవనం సమస్యను ఉపాధ్యాయులు వీరమాచినేని ప్రసాద్, టీడీపీ నేత దిరిశం వెంకట్రావ్ ఎమ్మెల్యేకు వివరించి నిర్మాణం పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Leave a Reply