MI vs SRH | హైద‌రాబాద్ పై ముంబై సునాయస విజయం..

వాంఖడే స్టేడియం వేదిక‌గా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సునాయస విజయం సాధించింది. తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్‌తో తలపడిన ముంబై 4 వికెట్ తేడాతో గెలిచింది. 163 పరుగుల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన ముంబై జట్టు 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

కాగా, ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు న‌మోదు చేసింది. ఇక స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌నకు దిగిన ముంబై బ్యాట‌ర్లో ఓపెన‌ర్లు ర్యాన్ రిక‌ల్ట‌న్(31), రోహిత్ శ‌ర్మ (26), విల్ జాక్స్ (36), సూర్య కుమార్ యాదవ్ (26), తిల‌క్ వ‌ర్మ (21 నాటౌట్), హార్దిక్ పాండ్య (21) అంతా స‌మిష్టిగా రాణించారు.

హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టగా, ఇషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.

అంతకముందు ఎస్ఆర్‌‌హెచ్ బ్యాటింగ్ లో.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. టాస్ ఓడిన తర్వాత ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైద‌రాబ‌ద్ ను… ముంబై జ‌ట్టు త‌మ‌ పటిష్టమైన బౌలింగ్‌తో క‌ట్ట‌డి చేయ‌గలిగింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ తీశారు.

హైదరాబాద్ బ్యాట‌ర్ల‌లో, పంజాబ్ పై సెంచరీతో చెల‌రేగిన‌ అభిషేక్ శర్మ… ఈ మ్యాచ్ లోనూ రాణించాడు. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 7 ఫోర్లతో 40), ట్రావిస్ హెడ్ తో తొలి వికెట్ కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ట్రావిస్ హెడ్ (28), నితిష్ కుమార్ రెడ్డి (19) ప‌రుగులకు ఔట‌య్యారు. హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల‌తో 37) ఆక‌ట్టుకున్నాడు. ఆఖ‌ర్లో అనికేత్ వ‌ర్మ (8 బంతుల్లో 2 సిక్సుల‌తో *18 నాటౌట్) మెరిశాడు. కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ (8) నాటౌట్ గా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *