Metal Road | గ్రామభివృద్ధికి అంకితమై…

Metal Road | గ్రామభివృద్ధికి అంకితమై…
- సర్పంచు ను కాదు… ప్రజలకు బానిస నై పనిచేస్తా..
- బోయపల్లి సర్పంచి సుందిశంకరమ్మ భూమయ్య
Metal Road | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : డిగ్రీవరకు చదివి నాడు విద్యావలాంటీర్(Educational volunteer) గా గ్రామంలోని ప్రైమరి పాఠశాలలో పని చేసిన సుందిళ్ళ శంకరమ్మ నేడు అదే గ్రామానికి సర్పంచ్ కావడం గొప్ప విషయం. కాగా ఈ రోజు గ్రామంలో ఇళ్ళు ఇళ్ళు తిరుగుతూ తనను గెలిపించిన ప్రజలను కలిసి సర్పంచి మైసమ్మ భూమయ్య కృతజ్ఞతలు తెలిపారు.
తన భర్త జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచి సుందిళ్ళ భూమయ్య ఉమ్మడి చౌటపల్లి గ్రామ సర్పంచిగా నిస్వార్థంతో పనిచేసి చౌటపల్లి, బోయపల్లి గ్రామాల అభివృద్ధి(Development)కి ఎంతో కృషి చేశారాని ఆమె తెలిపారు. తాజాగా తాండూరు మండలం బోయపల్లి గ్రామ పంచాయతీలోని ప్రజలు తనను నమ్మి ఓట్లేసి సర్పంచిగా గెలిపించడం పట్ల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాను సర్పంచి గా కాకుండా ప్రజలకు బానిసగా పని చేస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో మొత్తం 1358 మంది ఓటర్లు ఉండగా తన ప్రత్యర్థులు తనను ఓడించేందుకు శత విధాలుగా ప్రయత్నించినా ఓటరు దేవుళ్లు వారిని తిరస్కరించి, మట్టికరిపించి ఓడించారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) సహకారంతో గ్రామపంచాయతీలోని బురదగూడెంకు సీసీ రోడ్డు, ప్రతికూడలిలో సోలార్ హైమాస్ట్ లైట్లు, గ్రామంలో డ్రైనేజీ సిస్టం మెరుగుపరచడం, ఇళ్ళు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని శెంకరమ్మతెలిపారు.
బోయపల్లి సదర్ రోడ్డు నుంచి బెల్లంపల్లి మండలం కన్నాల వరకు మెటల్ రోడ్డు (Metal Road)నిర్మించడం, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు తీసుకు వస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహాయ సహాకారలతో కృషి చేస్తా నని శంకరమ్మ తెలిపారు.
