Meeting | జగన్‌ను చూసి…
- బాబు నేర్చుకోవాలి..
- కరోనా సంక్షోభంలోను
- ఆగని సంక్షేమం అభివృద్ధి..
- ప్రభుత్వ నిర్ణయాలు
- వ్యతిరేకిస్తున్న ప్రజలు..
- కోటి సంతకాలకు అనూహ్య స్పందన..
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్..
Meeting | విజయవాడ, ఆంధ్రప్రభ : కరోనా వంటే తీవ్ర సంక్షోభంలో కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అందించి అభివృద్ధిని పరుగులెత్తించాడని, అటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందని ఆరోపించిన ఆయన, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ముక్తకంఠంతో రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు గుర్తు చేశారు. నగరంలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించడం జరిగిందన్నారు.
అక్టోబర్ 10 నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగిందని, ప్రతి డివిజన్ ప్రతి ప్రదేశంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారన్నారు. జిల్లాలో నాలుగు లక్షల 22 వేలకు పైగా సంతకాలు వచ్చాయని, ఈ సంతకాలను కేంద్ర కార్యాలయానికి 15వ తేదీన పంపిస్తాం అన్నారు. ఈ పంపించే కార్యక్రమం చుట్టుగుంట సెంటర్ నుంచి శిఖామని సెంటర్ ర్యాలీగా నిర్వహిస్తాం అని ప్రకటించారు.ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ప్రైవేట్ వ్యక్తులు ఐతేనే మెడికల్ కాలేజీల నిర్వహణ బాగుంటాదని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

జగన్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే వాటిని పూర్తి చేయలేక పోయారని, చంద్రబాబు….జగన్ ను చూసి నేర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కరోనా లాంటి సంక్షోభంలో కూడా జగన్ ప్రభుత్వ పథకాలు ఆపలేదని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న అభివృద్ధి,,సంక్షేమం లేదని, అబద్ధపు ప్రచారలతో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. ఈ పాలనను ప్రజలు అందరూ గమనిస్తున్నారని, జగన్ ను మళ్ళీ గెలిపించటానికి ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. 15వ తేదీన నిర్వహించే ర్యాలీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని అవినాష్ విజ్ఞప్తి చేశారు.
ఈ ర్యాలీకి పోలీసుల నుంచి కూడా అనుమతులు ఉన్నాయని, దయచేసి పోలీసులు కూడా సహకరించాలి, పోలీసులకు తాము కూడా సహకరిస్తాం అన్నారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు,రాష్ట్ర కార్యదర్శి చల్లారావు,కార్పొరేటర్లు అంబేద్కర్,కొండారెడ్డి, రామిరెడ్డి,డివిజన్ ప్రెసిడెంట్లు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

