కేంద్రమంత్రి మనసుఖ్ మాండవ్యను కలిసిన ఎంపీ కేశినేని

కేంద్రమంత్రి మనసుఖ్ మాండవ్యను కలిసిన ఎంపీ కేశినేని

ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వపరంగా సహకరించాలని విజ్ఞప్తి

విజయవాడ, ఆంధ్రప్రభ: కేంద్ర యువజన,క్రీడల శాఖ మంత్రి మనసుఖ్ మాండవ్య ను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని ) న్యూఢిల్లీలో గురువారం కలిశారు. రాష్ట్ర శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎండి భరణి తో కలిసి కేంద్ర మంత్రిని పార్లమెంటు ఆవరణలో కలిసిన ఎంపీ శివనాథ్ ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వపరంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఏపీలో క్రీడల అభివృద్ధిపై చర్చ జరిపారు. ఖేలో ఇండియా ఇన్ఫ్రా ద్వారా పలు క్రీడా ప్రాజెక్టులకు నిధులు కోరి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 53 ప్రాజెక్టులకు రు. 1106 కోట్ల మేర అంచనా వ్యయంతో ప్రాజెక్టుల ప్రతిపాదన చేశారు. ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవ్య త్వరలోనే అందుకు సంబంధించిన ప్రాజెక్టుల మంజూరుకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయదలచారో లిఖిత పూర్వకంగా మంత్రికి ఎంపీ కేశినేని శివనాథ్ శాప్ ఎండీ, ఛైర్మన్‌తో కలసి కేంద్ర మంత్రికి తెలిపారు.

Leave a Reply