Congress | ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌ల నియామకం
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రాంతీయంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లను నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
ఈ క్రమంలో తెలంగాణలో ప్రస్తుతం దీపాదాస్ మున్షీ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జిగా ఉండగా.. ఆమే స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు కెసి వేణు గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శులు
- భూపేష్ బఘేల్ – పంజాబ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
- డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్ – జమ్మూ & కాశ్మీర్, లడఖ్‌లకు జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.
కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లు
- రజనీ పాటిల్ – హిమాచల్ ప్రదేశ్ & చండీగఢ్
- బి.కె. హరిప్రసాద్ – హర్యానా
- హరీష్ చౌదరి – మధ్యప్రదేశ్
- గిరీష్ చోడంకర్ – తమిళనాడు & పుదుచ్చేరి
- అజయ్ కుమార్ లల్లు – ఒడిశా
- కె. రాజు – జార్ఖండ్
- మీనాక్షి నటరాజన్ – తెలంగాణ
- సప్తగిరి శంకర్ ఉలక – మణిపూర్, త్రిపుర, సిక్కిం & నాగాలాండ్
- కృష్ణ అల్లవారు – బీహార్