మేడపెల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం..

మేడపెల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం..
99 రోజుల ప్రజా పాలనలో భాగంగా సేవలు
గ్రామీణులకు నాణ్యమైన వైద్యం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మేడపెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరానికి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు. ఈ సందర్భంగా పేషెంట్లను ఉద్దేశించి వైద్యులు మాట్లాడుతూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి.
ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు అని సూచించారు, ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని,ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు, శిబిరంలో మహిళలు, పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
మొత్తం 233 మంది ఓపీ సేవలు పొందగా,92 మంది లబ్ధిదారులు చికిత్స పొందినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేడ పెల్లి మేడ పెల్లి పీహెచ్సీ డాక్టర్ జ్యోతి, డాక్టర్ శివాని, డాక్టర్ ఎ. శ్రీలక్ష్మి, డాక్టర్ డి. స్వాతి, డాక్టర్ అఖిత, డాక్టర్ వంశీ కృష్ణ, డాక్టర్ శంకర్ వివిధ గ్రామాల సర్పంచులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
