ఉమ్మడి మెదక్ బ్యూరో, మార్చి 5 (ఆంధ్ర ప్రభ) : నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య- ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరుగగా, ఆయన అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ… వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యేలా నూతన మెడికల్ కాలేజీలను సిద్దం చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు.
మెడికల్ కాలేజీలలో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా – నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమీషనర్ ఆర్ వీ కర్ణన్, టీజీ ఏంఎస్ఐడి ఎండీ హేమంత్, డీఏంఈ డా.నరేంద్ర కుమార్, నిమ్స్ డైరక్టర్ డా.బీరప్ప, ఇతరత్రా ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.