Medical Camp | ఘంటసాలలో ఉచిత వైద్య శిబిరం

Medical Camp | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల బాపట్ల వారు జాతీయ సేవ పథకంలో (ఎన్ఎస్ఎస్)లో భాగంగా ఘంటసాల గ్రామంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రం(Primary Health Center) వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ వైద్యులు ప్రమోద్, రేపల్లె నుంచి సంజీవని ఎమర్జెన్సీ, స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డా. ఎస్.చలపతి, వారి సిబ్బంది సోని, శ్రవణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా డా.ప్రమోద్, డా.చలపతి రక్తదానం, అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించారు. గ్రామస్థులకు ఉచితంగా బీపీ, షుగర్ టెస్టుల(Sugar tests)ను చేసి మందులను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మాజీ వైస్ చైర్మన్ జి.వెంకట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, డా.సి.సంధ్యారాణి, డా.జి.విజయ్ కుమార్, డా.ఏ.జి.సువర్ణలత విచ్చేశారు.

Leave a Reply