medaram jatara | పలు రకాల మొక్కులు

మేడారం ( మంగపేట ) ఆంధ్రప్రభ : మేడారం జాతరలో వన దేవతలకు భక్తులు విభిన్నమైన మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తులలో కొంతమంది దేవతలకు ఎదురేగి కోళ్లను ఎగరేయడం ( ఎదురుకోళ్లు ) ద్వారా, కొందరు మగవాళ్లు ఆడవాళ్ల వేషధారణ ధరించి సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. మరి కొంతమంది అమ్మవార్లకు పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు, బెల్లాన్ని ( బంగారం ) కానుకలుగా సమర్పిస్తారు.
మరికొందరు సమ్మక్క పారలమ్మలకు కోడెలను ( కోడెను కట్టుట) కానుకలుగా సమర్పించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కోసం వరాలు పడుతుంటారు. తల్లి దీవెన వల్ల సంతానం కలిగిన వారు తమ పిల్లలనే త్రాసులో కూర్చోబెట్టి వారికి నిలువెత్తు బంగారాన్ని ( బెల్లం ) తులాభారంగా సమర్పిస్తారు. కొంతమంది అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు.
మరి కొంతమంది అమ్మవార్లకు కోళ్ళను, యాటపోతులను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోర్కెలను తీర్చిన అమ్మవార్లకు భక్తులు తాము మ్రొక్కిన విధంగా తన మొక్కలు చెల్లించుకుంటారు.
