నర్సాపూర్, (ఆంధ్ర ప్రభ) : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట ప్రధాన రహదారి మలుపు వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు, లారీ ఢీకొనడంతో ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై చిన్న చింతకుంట మలుపు వద్ద రెండు బైక్‌లు, లారీ ఢీకొనడంతో… బైక్‌పై వెళ్తున్న వెంకట్రావుపేట గ్రామానికి చెందిన గోపి అతని కుమారుడు లోకేష్, గోమారం గ్రామానికి చెందిన అతని వదిన కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.