Medak | వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

Medak | వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ పట్టణం పిల్లికొట్యాల శివారు 20ఎకరాల విస్తీర్ణంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (Mynampally Rohit Rao) ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి రవడంతో వైద్య సేవలు మరింత చేరువై స్థానిక ప్రజలకు, విద్యార్ధుల (students) కు సహాయపడుతుందని తెలిపారు. నూతన వైద్య కళాశాలతో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నితిన్ కాబ్రా, సూపరిండెంట్ సునీత, డిసిహెచ్ఎస్ శివ దయాల్, ఎంసీఏహెచ్ ఓడి రాజశ్రీ, ప్రొఫెసర్లు, ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య శాఖా అధికారులు పాల్గొన్నారు.
