Medak | స్వీపర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

Medak | స్వీపర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

కొండపాక, ఆంధ్రప్రభ : కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో స్వీపర్‌ పోస్ట్‌ లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి పి.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. స్వీపర్‌ పోస్ట్‌ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడవ తరగతి పాసై ఉండాలన్నారు.

18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తిగల వారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కేజీబీవీ హాస్టల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ కు ఈనెల 18 నుండి 20 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏడవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ తో పాటు- నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్‌ జత చేయాలన్నారు. మండల లెవెల్‌ కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఏమీ ఓ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Leave a Reply