Medak | కాంగ్రెస్ బోణీ.. 32వ వార్డు ఏకగ్రీవం

Medak | కాంగ్రెస్ బోణీ.. 32వ వార్డు ఏకగ్రీవం

  • రెండోసారి కౌన్సిలర్ గా గోదల మానస సాయిరాం

Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పురపోరులో కాంగ్రెస్ బోణీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కౌన్సిలర్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. మెదక్ మున్సిపాల్టీలోని 32 వార్డును ఏకగ్రీవం చేశారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలో మొత్తం 75 వార్డులకు గాను 415 నామినేషన్లు వచ్చాయి. మెదక్ మున్సిపాలిటిలో 32 వార్డులు ఉండగా, 32వ వార్డు నుంచి గోదల మానస సాయిరాం ఏకగ్రీవమయ్యారు. 32వ వార్డులో కాంగ్రెస్ నుంచి గోదల మానస సాయిరాం నామినేషన్ వేసి బరిలో నిలువగా, బీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థులు గోదల జ్యోతి బరిలో నిలిచారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు చొరవతో గోదల జ్యోతి తమ నామినేషన్ ను ఉపసంహరణకు అంగీకరించింది. దీంతో గోదల మానస సాయిరాం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికకావడం జరిగింది.

Leave a Reply