May20 |అప్పుడే టైటిల్ అనౌన్స్ చేస్తారా?

May20 | అప్పుడే టైటిల్ అనౌన్స్ చేస్తారా?
May20 | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో.. టైటిల్ పై సస్పెన్స్
‘డ్రాగన్’ కాదు.. ‘బ్రూస్ లీ’నా? వైరల్ అవుతున్న టైటిల్
చరణ్ ప్లాప్ టైటిల్ ను ఎన్టీఆర్ మూవీకి పెడతారా?
జోర్డాన్ లో యాక్షన్ ఎపిసోడ్.. యంగ్ టైగర్ ఫుల్ బిజీ
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబోలో భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకగా నిర్మిస్తుంది. అయితే.. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆతర్వాత టైటిల్ మార్చనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓ టైటిల్ వైరల్ అవుతోంది. అది చరణ్ ప్లాప్ టైటిల్ కావడం మరింతగా ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఆ టైటిల్ ఏంటి..? ఈ క్రేజీ మూవీ అప్ డేట్ ఏంటి..?
May20 | అదే జరిగితే సంచలనమే..

ఈ క్రేజీ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకున్నప్పటికీ.. ఈ టైటిల్ ను మారుస్తారని ప్రచారం జరిగింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రీ రవి శంకర్ కూడా ఓ ప్రెస్ మీట్ లో మరో టైటిల్ పెడతామని.. డ్రాగన్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే అన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఈ మూవీ టైటిల్ గురించి టాక్ నడుస్తుంటుంది. తాజాగా ఈ సినిమాకి బ్రూస్ లీ అనే టైటిల్ పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది చరణ్ నటించిన సినిమా టైటిల్. 2015లో వచ్చింది. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
May20 | జోర్డాన్ లో.. యంగ్ టైగర్..

అలాంటిది ప్లాప్ మూవీ టైటిల్ ను ఎన్టీఆర్ మూవీకి ఎందుకు పెడతారు అనే డౌట్ వస్తుంది. పదేళ్ల క్రితం వచ్చిన ప్లాప్ టైటిల్ ని ఎన్టీఆర్ మూవీకి పెడతారా అనే డిష్కసన్ సోషల్ మీడియలో జరుగుతుంది. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ టైటిల్ ని పెడితే అది సంచలనమే. ఇక ఈ మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం జోర్డాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ పై ఓ సాంగ్ కూడా చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ పాన్-ఇండియా మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మరి.. ఈ క్రేజీ, భారీ చిత్రానికి ఏ టైటిల్ పెడతారో.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో.. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

