HYD | పోలీసుల కస్టడీకి మస్తాన్‌సాయి..
- అనుమతించిన రాజేంద్రనగర్ కోర్టు
అభ్యంతరకర వీడియోలతో యువతులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
మస్తాన్సాయిని తమ కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో మస్తాన్‌సాయిని రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్‌సాయిని పోలీసులు ఈ నెల 13న కస్టడీలోకి తీసుకోనున్నారు. మస్తాన్సాయిపై గతంలో నార్సింగి, మోకిల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.