భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు

భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాల(Job placements)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర‌కు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ)(TGSRTC) మొత్తం 1,743 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేలా తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపట్ట‌నున్నారు.

  • ఉద్యోగాల వివరాలు..

ఈ నియామకాల్లో 1,000 డ్రైవర్ పోస్టులు, 743 వర్కర్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు(Candidates) నిర్ణీత సమయంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  • దరఖాస్తు తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 8 నుంచి 28 వరకు కొనసాగుతుంది. అర్హతలు, వయో పరిమితి, అర్హత ధ్రువపత్రాలు(Eligibility Certificates), ఫీజు వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారిక సమాచారం.

  • ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. డ్రైవర్ పోస్టులకు.. డ్రైవింగ్ నైపుణ్యాలు( Driving Skills), చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వర్కర్ పోస్టులకు(for Worker Posts)… రాత పరీక్షలు, నైపుణ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఈ నియామకాలతో తెలంగాణ యువత(Telangana Youth)కు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, రవాణా సంస్థ సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు.

Leave a Reply