శ్రీనగర్ లో భారీ పేలుడు.. ఏడగురు దుర్మరణం.. 30 మంది పైగా తీవ్ర గాయాలు
(ఆంధ్రప్రభ. వెబ్ న్యూస్ )
శ్రీనగర్‌లో భారీ పేలుడు కకావికలం సృష్టించింది. ఉగ్రమూకల దాచిన పేలుడు పదార్థాలను వెలికి తీస్తున్న క్షణాల్లో విస్షోటనం సంభవించింది. (Massive explosion) ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం ( 7dead in spot) చెందారు. 30 మంది పైగా తీవ్రంగా (30 injured) గాయపడ్డారు. హతుల్లో ఫోరెన్సిక్ సిబ్బంది ( polce, forensic person) ఉన్నారు. ఎర్రకోటలో ఉగ్రదాడి మూలాల అన్వేషణలో ఈ ఘోరం జరిగింది. ఢిల్లీ ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపిల్స్ ను అధికారులు తీస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ( Srinagar nowgam polce station) శుక్రవారం అర్థరాత్రి 11.22 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెరమీదకు వచ్చిన వైట్‌కాలర్ ఉగ్రవాద ముఠా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఫొరెన్సిక్ అధికారులు ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను మెజిస్రేట్ ఎదురుగా ( at magistrate ) సీజ్ చేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా పేలుడుతో సిబ్బంది మృతదేహాలు 300 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయి. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉగ్రదాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుడు సంభవించిన ప్రాంతంలో ఓ కారు కూడా పేలిపోయింది. ఈ కారులో పేలుడు పదార్థాలను టెర్రరిస్టుటు ప్రయోగించారా? అనే అనుమానాలతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ పేలుడు ధాటికి అక్కడికి సమీపంలో ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు, ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. శ్రీ నగర్లో పేలుడు ప్రాంతంలో ఏడగురు మృతదేహాలను వెలికితీశారు. మృతుల వివరాలు తెలియరాలేదు. జమ్ము కశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో పుల్వామా కోయిల్‌కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ గనాయీ అలియాస్ ముసైబ్ అద్దె ఇంట్లో స్వాధీనం చేసుకున్న 360 కిలోల ఐఈడీ పదార్థాలను శ్రీనగర్ తీసుకు వచ్చారు. ఆ మొత్తం 360 కిలోల పేలుడు పదార్థాలను ( 360 kg ammonium nitrate) పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారా? లేదా అనేది తెలియ రాలేదు. ఈ టెర్రర్ మాడ్యూల్ కేసు ప్రధానంగా ఇక్కడే నమోదు అయ్యింది.

