Mass copying | ఎందుకంటే…

Mass copying | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : 12వ తరగతి పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ జరిగిన ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరా ఫుటేజీతో ఈ అవకతవకలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ వివేక్ జాన్సన్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో, పరీక్షా కేంద్రం చీఫ్‌తో సహా 17మంది ఉపాధ్యాయులపై కేసు నమోదైంది. చౌశాలాలోని ఒక పరీక్ష కేంద్రంలో 16 ఎగ్జామినేషన్ హాళ్లలో సూపర్‌వైజర్లు విద్యార్థులకు కాపీ కొట్టడానికి సహకరించినట్లు గుర్తించారు. సహకరించిన ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు.

Leave a Reply