మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే..

మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే..

బావిలో పడి యువకుడి మృతి
తారుపల్లిలో తీవ్ర విసాదం


పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : మరికొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి యువకుడు (young man) మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

తారుపల్లి గ్రామానికి చెందిన సూరం శ్యామ్ రాజ్ (Shyam Raj) (22) అనే యువకుడు ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తారుపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి దగ్గరలో శ్యామ్ రాజ్ చెప్పులు కనిపించడంతో బావిలో పడిపోయాడని గమనించిన తల్లిదండ్రులు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు.

గజ ఈతగాళ్లతో బావిలో గాలింపు చర్యలు చేపట్టగా శ్యామ్ రాజ్ మృతదేహం లభ్యమైంది. ఈనెల 23న శ్యామ్ రాజ్ కు వివాహం నిశ్చయించారు. అయితే పెళ్లి పీటలు ఎక్కనున్న ఆ యువకుడు బావిలో పడి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నీలిమ తెలిపారు.

Leave a Reply