మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలి…

మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలి…
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని కలిసి మార్కెట్ కమిటీ లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ లలో పనిచేస్తున్న సిబ్బంది కి సకాలంలో వేతనాలు అందకపోవడం,యార్డుల అభివృద్ధి, పనులు మంజూరు లో జాప్యం, చైర్మన్ల గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య,రాష్ట్రంలోని వివిధ మార్కెట్ కమిటీ ల చైర్మన్ లు, తదితరులు పాల్గొన్నారు.
