తొర్రూర్ టౌన్, మార్చి 28(ఆంధ్రప్రభ ) : డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ లో ఇవాళ ఉదయం సుమారు 11గంటల సమయంలో గంజాయిని తొర్రూర్ ఎస్సై ఉపేందర్ పట్టుకున్నారు. ఈ విషయమై ఎస్సై ఉపేందర్ ను వివరణ కోరగా, బస్టాండ్ లో 1 నెంబర్ ప్లాట్ ఫారం వద్ద అనుమానంగా ఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు భ్యాగులతో ఉన్నారని, వారిని తనిఖీ చేయగా గంజాయి దొరికిందన్నారు. స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Thorrur | బస్టాండ్ లో గంజాయి పట్టివేత
