రోడ్డు పై వెలసిన మావోయిస్టుల పోస్టర్లు

రోడ్డు పై వెలసిన మావోయిస్టుల పోస్టర్లు

నూగురు వెంకటాపురం, సెప్టెంబర్ 20(ఆంధ్ర ప్రభ) : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ(Patrapuram village) శివారు నుండి టేకుల బోరు గ్రామ శివారు వరకు, భద్రాచలం వెంకటాపురం రాష్ట్ర రహదారికి ఇరువైపులా చెట్లకు అతికించి వెలిసిన కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు(Communist India) మావోయిస్టు పార్టీ, వాల్ పోస్టర్లు కరపత్రాలు వెలిసాయి. వాటి సారాంశమేమిటంటే….

సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వారోత్సవాలను సెప్టెంబర్ 21 నుండి 27 వరకు దేశ వ్యాప్తంగా విప్లవ స్పూర్తి(revolutionary spirit)తో నిర్వహించండి. పార్టీని, పి.ఎల్.జి. ఏ ను, ఐక్య సంఘటను, విప్లవ ఉద్యమాన్ని కాపాడుదాం. విప్లవ ప్రతిఘాతక ‘కగార్'(‘Kagar’) యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులకు వర్గ పోరాటంలో, గెరిల్ల యుద్ధం(Guerrilla War)లో సమీకరిద్దాం. శత్రువుకు అభేధ్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాం.


విప్లవోద్యమ వెనుకంజ స్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందాం అని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులకు(Party Lines) పి.ఎల్.జి ఏ బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలను, ప్రజానీకానికి సిపిఐ, మావోయిస్టు కేంద్ర కమిటీ(Central Committee) పిలుపు పేరట ఈ విధంగా పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి.

Leave a Reply