Surrender | మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు..

Surrender | మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు..

మావోయిస్టుల‌కు మరో ఎదురు దెబ్బ
మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు


హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : మావోయిస్టుల‌కు మరో ఎదురుదెబ్బ త‌దిలింది. మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఛత్తీస్‌గఢ్‌లో ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్రపోషించారు. బర్సే లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించనున్నారు.

Leave a Reply