Maoist | స‌రెండ‌ర్…

Maoist | స‌రెండ‌ర్…

Maoist | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుంది. నలుగురు మావోయిస్టు కీలక నేతలు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇవాళ లొంగిపోనున్నారు. దేవి.. అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నరసింహారెడ్డి అలియాస్ గంగన్న.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు లొంగిపోనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం దేవ్ జీ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. దేవ్ జీ రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు. కోరుట్లలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన తిరుపతి ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానీకం భూస్వాముల అణచివేతపై చిన్నప్పటి నుంచే తిరుగుబావుటా ఎగురవేశారు. 1981లో పదో తరగతి నుంచే ఆయన రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులయ్యారు. ఇక అలాగే ఆయన మావోయిస్టు ఉద్యమంలో ముఖ్య నేతగా ఎదిగారు.

Maoist |

Leave a Reply