మ‌హిళ‌ల కోసం ఎన్నో ప‌థ‌కాలు

మ‌హిళ‌ల కోసం ఎన్నో ప‌థ‌కాలు

చేవెళ్ల, ఆంధ్రప్రభ : మ‌హిళ‌ల కోసం ప్ర‌ధాని మంత్రి న‌రేంద‌ర్ మోడీ(Prime Minister Narendra Modi) అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి అన్నారు. ఈ రోజు ప్ర‌ధాని మోడీ 75వ జ‌న్మ‌దిన(Modi on his 75th birthday) సంద‌ర్భంగా ర‌క్త‌దాన శిబిరాన్నిఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోవిడ్(Covid) కష్టకాలంలో మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్షిన్ అందించిన ఘనత పీఎం మోదీదనితెలిపారు. అదేవిధంగా దేశాన్ని(Nation) వికసిత్ భారత్ నిలుపుతున్నారని వివరించారు.

అనంతరం రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలను(Certificates) పంపిణీ చేశారు. ఈ క్ర‌మంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, తహశీల్దార్ క్రిష్ణయ్య(Tehsildar Krishnaiah), చేవెళ్ల సీహెచ్ సీ సూపరిండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply