ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌రెన్నో ప‌థ‌కాలు

ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌రెన్నో ప‌థ‌కాలు

తిర్యాని, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు జువాజీ అనిల్ గౌడ్(Juaji Anil Goud) అన్నారు. తిర్యాణి మండలంలోని మొర్రిగూడ(Morriguda) గ్రామంలో రేకుల షెడ్డుకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామాల్లో ఉన్న వివిధ సమస్యలను వారికి తెలియజేశారు.

వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎన్నో గ్రామాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహర్ధశ పట్టిందని అన్నారు. ఎన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ప్రతిష్టాత్మకంగా మరెన్నో పథకాలు కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిత్తారి సాగర్(Chittari sagar), యూత్ మండల అధ్యక్షుడు పున్నం హరీష్ కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ బొక్కనపల్లి సాయికిరణ్(Bokkanapally Saikiran), పెరుమాండ్ల, వెంకటేశం గౌడ్, మాజీ సర్పంచ్ కుడిమేత లచ్చు, జుగునాక జంగు, ఆత్రం లక్నోపతి, కాత్లే సూరు, కోట్నాక భీమ్ రావు, గేదం సుంగు, ఆత్రం మాధవరావు, కుడుమేత సుంగు, కుడిమేత భగవంతురావు, జుగునాక మారుతి, ఎలుమల లక్ష్మణ్, ఆత్రం దౌలత్రావు, కుడి మేత దేవరావు, పెరుమాళ్ళ రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply