కౌన్సిలర్ కళ్యాణికి పలువురి అభినందనలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 4 వ వార్డు నుండి బిఆర్ఎస్ కౌన్సిలర్ గా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసిన బీజని కళ్యాణి మధు కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు చెప్పారు. కళ్యాణి మధు దంపతులను శాలువాలతో సత్కరించారు.
