Manthani | మొదటి రోజే స్వచ్ఛత వైపు అడుగు….

Manthani | మొదటి రోజే స్వచ్ఛత వైపు అడుగు….

  • ప్రమాణ స్వీకారం తర్వాత స్వయంగా పరిశుభ్రం చేసిన సర్పంచ్

Manthani | మంథని, ఆంధ్ర‌ప్రభ : మంథని మండలం దుబ్బ పల్లి గ్రామ సర్పంచ్ ఎర్రవెల్లి కృష్ణవేణి నరేష్ రావు మొదటిరోజు స్వచ్ఛత వైపు అడుగు వేశారు. సోమవారం దుబ్బపల్లి సర్పంచ్ గా ఎర్రవెల్లి కృష్ణవేణి(Erravelli Krishnaveni) నరేష్ రావు ప్రమాణస్వీకారం చేశారు. పాలకవర్గ సభ్యులు చేత ప్రమాణస్వీకారం చేయించారు.

అనంతరం సర్పంచ్ అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు స్వయంగా శ్రమదానం చేసి గ్రామంలోని వార్డులు పరిశుభ్రం చేయించారు. మొదటి రోజే అభివృద్ధికి పునాది వేయడంతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం జనరల్ మీటింగ్(General Meeting) ఏర్పాటు చేసుకొని కొత్త తీర్మానాలు చేశారు. గ్రామంలోని మోటార్ రిపేర్, గ్రామపంచాయతీ ట్రాక్టర్ రిపేర్, వాల్స్ రిపేర్ గురించి తీర్మానం చేయడంతో పలు అభివృద్ధి అంశాల గురించి వారు చర్చించారు.

ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తానని, ప్రజలతో సమన్వయం పరుచుకుంటూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మండల రాహుల్, వార్డు సభ్యులు కళ్యాణి, స్రవంతి, మమత, సారయ్య, రవీందర్, శ్రీ రామ్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply