జిల్లా కలెక్టర్ ను కలిసిన మంథని మున్సిపల్ చైర్మన్

మంథని, ఆంధ్రప్రభ : ఇటీవల నూతనంగా ఎన్నికైన మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ సహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి మంథని మున్సిపాలిటీ అభివృద్ధికై పాలకవర్గాని సహకరించాలని కోరారు. కలెక్టర్ వారికి అభినందనలు తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి పనుల గురించి చర్చించి, మంథని మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.

Leave a Reply