ప్రజల కోసం పరితపించే బానయ్యను గెలిపించండి

ప్రజల కోసం పరితపించే బానయ్యను గెలిపించండి
మంత్రి శ్రీధర్ బాబు
శ్రీపతి బానయ్య తరపున విస్తృతంగా ప్రచారం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి
మంథని: మంథని మున్సిపల్ పరిధిలో మూడవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీపతి బానయ్య ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని ఆయనను గెలిపించండి సమన్యాయ పరిపాలన అందజేస్తామని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రచారానికి అడుగడుగున జనాలు బ్రహ్మరథం పట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు వరాల జల్లులు కురిపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధి మరింత చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. మూడవ వార్డ్ ప్రజలు ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటేయాలని, ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభ్యర్థి బానయ్య మాట్లాడుతూ… గెలిచిన తర్వాత పాలకుల వలె కాకుండా సేవకుల వలె పరిపాలన అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.
