హైదరాబాద్ – మణికొండ పట్టణంలో ని పంచవటి కాలనీ శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీశ్రీశ్రీ లలితా సమేత కామేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రిపర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం నుండి స్వామి వారికి అభిషేకాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివ పార్వతుల కల్యాణం వేద పండితుల పర్యవేక్షణలో ఘనంగా జరిగింది .

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.వేదపండితుల చేత నిర్వహిస్తున్నకల్యాణ మహోత్సవం లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి,అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేసారు.
అన్ని పర్వదినాలకు దేవాలయం లో ఉత్సవాలు అత్యంత సంప్రదాయ బద్ధం గా నిర్వహిస్తున్న కమిటీ వారిని స్థానిక కాలనీ వాసులు,భక్తులు అభినందించారు..