మంగళగిరి ఏప్రిల్ 4 ఆంధ్రప్రభ – నాడు మాట ఇచ్చాడు.నేడు ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే ఇచ్చిన మాట మంత్రి నారా లోకేష్ నెరవేర్చాడు. గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గం అధికారంలోకి వచ్చిన ఏడాది లోగా పట్టాలు పంపిణీ చేస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. నేడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పది నెలల లోగానే ఇచ్చిన మాట నెరవేర్చుకుని ప్రజల మన్ననలను పొందారు. దీనితో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు పట్టాలు అందజేస్తున్న మంత్రి నారా లోకేష్ కు, కూటమి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పండుగలా.. పట్టాభిషేకం
పండగ వాతావరణంలా ఇంటి లబ్ధిదారులకు ఇంటి పట్టాల పట్టాభిషేకం శుక్రవారం జరిగింది. ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేవు. గత దశాబ్ద కాలంగా ఆయా ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇంటిని నివేశా పట్టాలు అందజేసిన మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ను ప్రజలు కొనియాడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల లో భాగంగా 10 నెలలలోనే శాశ్వత ఇంటి నివేసా పట్టాలను అందజేసిన మంత్రి నారా లోకేష్ కు లబ్ధిదారులు రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఇళ్ల పట్టాలతో పాటు నూతన వస్త్రాలను లబ్ధిదారులకు స్వయంగా మంత్రి నారా లోకేష్ అందజేశారు. శాశ్వత నివేశ పట్టాలను అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను స్వయంగా అందజేయడంతో అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి ని.. నారా లోకేష్ శాశ్వతంగా ఏలాలి..!
మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ శాశ్వతంగా ఏలాలని ఆయన చేతుల మీదుగా శాశ్వత ఇల్ల పట్టాలందుకున్న లబ్ధిదారులు ఆకాంక్షించారు. కొండ చెరువు, కాలువ పోరంబోకు రైల్వే ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ మన ఇల్లు మన లోకేష్, పేదలకు పట్టాభిషేకం పేరుతో శాశ్వత ఇల్లపట్టాల పంపిణీ కి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 3000 మందికి శాశ్వత ఇల్ల పట్టాలను అందజేస్తున్నారు. గురువారం ఉండవల్లిలో గోవింద్ సీతా మహాలక్ష్మి ఇంటికి స్వయంగా వెళ్లి మంత్రి లోకేష్ బట్టలు పెట్టి మొదటి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు.
శుక్రవారం నాడు ఎర్రబాలెం గ్రామానికి చెందిన 248 లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను. అందజేశారు ఎర్రబాలెం గ్రామంలో ఎస్టి సామాజిక వర్గానికి చెందిన కుంభ తిరుమల ,గోపి దంపతులు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టా అందుకున్నారు. తిరుమల అనే మహిళ స్పందిస్తూ నా భర్త పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. గత 10 ఏళ్లుగా ఇద్దరు పిల్లలతో కలిసి ఎర్రబాలెం ట్యాంకు వద్ద పూరి పాకలో నివాసం ఉంటున్నాము. వైసీపీ ప్రభుత్వం ఇళ్లను తొలగిస్తుoటే లోకేష్ ను కలిసి మా ఆవేదన వ్యక్తం చేసాము. మమ్మల్ని ఓదార్చి తమ ప్రభుత్వం లో శాశ్వత పట్టాలు అందజేస్తామని ఆనాడు లోకేష్ హామీ ఇచ్చారని అన్నారు. అన్నట్లుగానే ఇంటి పట్టా అందించారని వారు సంతోషంగా తెలిపారు.
తమకు శాశ్వత ఇంటి పట్టా అందజేసిన ఎర్రబాలెం గ్రామానికి చెందిన 70 ఏళ్ల కాజా భారతి అనే వృద్ధురాలు లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని శాశ్వతంగా ఏలాలని ఆకాంక్షించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాము కుమార్తెలతో కలిసి ఎర్రబాలెం ఆంజనేయ స్వామి గుడి వద్ద పూరిపాక వేసుకొని 15 ఏళ్లుగా జీవిస్తున్నా మన్నారు. నా కుమార్తెకు ఇద్దరు సంతానం. భర్త లేడు. ప్రభుత్వం నాకు పెన్షన్ అందిస్తోంది. వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మన్నారు. మంత్రి నారా లోకేష్ ఇప్పుడు శాశ్వత పట్టా మంజూరు చేయటంతో నూతన ఇల్లు నిర్మించుకుంటామని సంతోషం వ్యక్తం చేసి పట్టా అందించి అండగా నిలిచిన మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంతోమంది పాలకులు వచ్చిన శాశ్వత పరిష్కారం చూపలేదని మంత్రి నారా లోకేష్ అధికారం చేపట్టిన 10 నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలోని లబ్ధిదారులు అందరికీ ఇంటి శాశ్వత పట్టాలను అందజేయడంతో వారు ఆనందంతో ఉప్పంగి పోతున్నారు. ఇళ్ల పట్టాలని అందుకున్న లబ్ధిదారులు టిడిపి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి,మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ కు, జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు