Mandali Buddhaprasad | ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు

Mandali Buddhaprasad | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో నూతన ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ. 9.362 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్య మౌళిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి కలిపి మొత్తం 38 ఆరోగ్య కేంద్రాలకు 15వ ఆర్థిక సంఘం ఆరోగ్య నిధులు, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులు రూ.9.362 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఈ మేరకు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

Leave a Reply