Manchu Manoj | డేవిడ్ రెడ్డి సక్సెస్ అందించేనా..?

Manchu Manoj | డేవిడ్ రెడ్డి సక్సెస్ అందించేనా..?

Manchu Manoj, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా డేవిడ్ రెడ్డి. ఈ సినిమాను డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. డేవిడ్ రెడ్డి సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. అభిమానుల అభిమానం ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అభిమానులు ఇన్నేళ్లుగా ఇస్తున్న ప్రేమ, అభిమానానికి పాదాభివందనం. హీరోగా సినిమాలు చేయి అని నన్ను నిత్యం ప్రోత్సహిస్తుంటారు మీరంతా. నేను ఎలాంటి సినిమాతో మళ్లీ హీరోగా రావాలని అనుకుంటున్న టైమ్ లో నా మిత్రుడు రామ్ ఫోన్ చేసి మంచి కథ ఉంది వినమని అన్నాడు. అదే డేవిడ్ రెడ్డి మూవీ. కథ విన్న వెంటనే నాకు బాగా నచ్చింది. నన్ను ఎలాంటి మూవీలో చూపిస్తే.. బాగుంటుందో, మీరు నన్ను ఎలాంటి మూవీలో చూడాలని అనుకుంటున్నారో అలాంటి స్టోరీని దర్శకుడు హనుమ రెడీ చేశారు.

1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాను ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ పెట్టి వెంకట్ రెడ్డి, భరత్ గారు ప్రొడ్యూస్ చేశారు. వాళ్లు డైరెక్టర్ హనుమ మీద పూర్తి నమ్మకంతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. డేవిడ్ రెడ్డి బ్రిటీష్ వారికే కాదు ఇండియన్స్ కూడా శత్రువే. డేవిడ్ రెడ్డికి పీస్ ఫుల్ గా ఉండటం రాదు, ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి నాతో మూవీ చేస్తున్న డైరెక్టర్ హనుమకు థ్యాంక్స్. అలాగే మా రవి బస్రూర్ గారు, సుప్రీమ్ సుందర్ గారు, ఎడిటర్ ఉజ్వల్ గారు, డీవోపీ ఆచార్య వేణు గారు వీళ్లంతా మా టీమ్ లో పార్ట్ అయినందుకు వారికి థ్యాంక్స్ చెబుతున్నా.

డేవిడ్ రెడ్డి బైక్ పేరు వార్ డాగ్, అతని చేతులో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్. ఇవి రెండు డేవిడ్ రెడ్డి ఆయుధాలు. ఇండియాకు స్వాతంత్ర్యం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలి అనేది డేవిడ్ రెడ్డి దృక్పథం. బ్రిటీష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగలబెడుతుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్ రెడ్డి కనిపిస్తాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, శింబు గెస్ట్ లుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కథలో గెస్ట్ రోల్స్ కు అవకాశం ఉంది. అయితే.. మేము ఇప్పటి వరకు ఏ హీరోను అప్రోచ్ కాలేదు. ఆ డీటెయిల్స్ తర్వాత చెబుతాం. నేను సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్ చేసినప్పుడు నాకు సపోర్ట్ గా ఉండి నెత్తిమీద పెట్టుకున్నారు అభిమానులు. వాళ్లకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది. చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలు, దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది అనేది మా డేవిడ్ రెడ్డి మూవీలో చూస్తారు అన్నారు.

Leave a Reply