Manchu Manoj | డేవిడ్ రెడ్డి ఎలా ఉండబోతుంది…?

Manchu Manoj | డేవిడ్ రెడ్డి ఎలా ఉండబోతుంది…?
Manchu Manoj | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మంచు మనోజ్.. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాల్లో నటించాడు. అయితే.. కెరీర్ లో కొన్ని కారణాల వలన బాగా గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు సినిమాల పై ఫోకస్ పెట్టాడు. ఓ వైపు విలన్ గా, మరో వైపు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా డేవిడ్ రెడ్డి (David Reddy) అనే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ కు అనూహ్య స్పందన వస్తోంది. ఇంతకీ.. డేవిడ్ రెడ్డి మూవీ ఎలా ఉండబోతుంది..? ఈ సినిమాతో మనోజ్ ఫామ్ లోకి వచ్చేనా…?
Manchu Manoj | ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే..
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా డేవిడ్ రెడ్డి. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ (Firstlook Poster) చూస్తే.. ఇదేదో రెగ్యులర్ మూవీలా అనిపించడం లేదు. మనోజ్ లుక్ చాలా పవర్ ఫుల్ గా, చాలా డిపరెంట్ గా ఉంది. గతంలో చేసినట్టే.. ఇప్పుడు కూడా ఓ వైవిధ్యమైన సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అలాగే ఇందులో మాస్ ఆడియన్స్ నచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయనే ఫీలింగ్ కలిగిచింది.

Manchu Manoj | ఇంతకీ జోనర్ ఏంటంటే…
బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కనుందని తెలిసింది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో రూత్ లెస్, బ్రూటల్ అనే రెండు లుక్స్ లో మంచు మనోజ్ ఇంటెన్స్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు లుక్స్ చూస్తే మూవీలో టెర్రఫిక్ యాక్షన్ (Terrafic Action) ఉంటుందని తెలుస్తోంది. మంచు మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, పర్ ఫార్మెన్స్ తో డేవిడ్ రెడ్డి పాత్రకు లైఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా మనోజ్ కు ఒక మంచి కమ్ బ్యాక్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ సినిమా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మరి.. ఈ మూవీతో సక్సెస్ సాధించి హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి.

CLICK HERE TO READ 3 సీక్వెల్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న తేజ సజ్జ
