Mancherial | పోలింగ్ ప్రశాతం… కౌంటింగ్‌లో గలాటాలు

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు కోటపెల్లి మండలాల్లో మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ 87 శాతం ప్రతిష్టాత్మకంగా జరిగింది. అయితే, మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.

చెన్నూరు మండలంలోని బావురావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపులో ఒక్కరికి రెండు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీనిపై ప్రత్యర్థి అభ్యర్థి నాయకులు రీకౌంటింగ్ చేయాలని కౌంటింగ్ కేంద్రంలో ఆందోళన వ్యక్తం చేయడంతో, ఎన్నికల సిబ్బంది భయాందోళనకు లోనయ్యారు. ఈ సమయంలో పోలీసులు జోక్యంతో ఆందోళనను సద్దుమనించారు.

అదే విధంగా మరికొన్ని గ్రామాల్లో కూడా ఈ పరిస్థితి ఏర్పడింది, అయితే పోలీసులు సిబ్బందికి సహకారం అందించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన లెక్కింపులో కొన్ని గ్రామాల్లో అభ్యర్థుల ఫలిత ప్రకటనలో ఆలస్యం చోటుచేసుకుంది.

Leave a Reply