రోడ్డు ప్రమాదం లో వ్యక్తి దుర్మరణం..

(ఆంధ్రప్రభ, కోడూరు) : కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ ముఠామేస్త్రి బత్తుల నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.రామచంద్రపురం సమీపంలోని ఎ వన్ ఫంక్షన్ హాల్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అవనిగడ్డ నుండి విశ్వనాథపల్లికి బైక్ పై వెళుతుండగా అదుపు తప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటనతో విశ్వనాథపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
