తిమ్మాపూర్ మండలంలో విషాదం
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన అలువాల శంకర్ (32) పాము కాటుతో మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము కాటు వేసింది. పాము కుట్టిన సంగతి లేటుగా గ్రహించడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు శంకర్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మృతుడు శంకర్ డెయిరీ కంపెనీలో లేబర్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

